నిజామాబాద్‌లో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం
హైదరాబాద్: నిజామాబాద్‌లో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ఉన్న ఆక్రమణలను నగరపాలక సంస్థ అధికారులు తొలగిస్తున్నారు. బస్టాండ్ వెనుక వైపు ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్న సమయంలో నగరపాలక సంస్థ అధికారులను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రొక్లెయిన్ డ్రైవర్ పై దాడికి యత్నించిన ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు.