గుల్బర్గా సొసైటీ వివాదంలో తీస్తా సెతల్వాద్‌ దంపతులపై కేసు

ముంబయి: సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌, ఆమె భర్త జావెద్‌ ఆనంద్‌లపై కేసు నమోదైంది. గుజరాత్‌ అల్లర్ల సందర్భంగా జరిగిన మారణహోమంలో 68 మంది ప్రాణాలు కోల్పోయిన గుల్బర్గా సొసైటీని మ్యూజియంగా మార్చేందుకు గాను వీరు జకియా జాఫ్రీ కుమారుడు తన్వీర్‌ జాఫ్రీ, మరో ఇద్దరితో కలిసి రూ. 1.51 కోట్లు బలవంతంగా సేకరించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. మ్యూజియం కోసం సేకరించిన నిధులను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుగా సెతల్వాద్‌ తన వద్దే ఉంచుకున్నారని వారు పేర్కొన్నారు.