తెహల్కా పత్రిక మూసివేత?

న్యూఢిల్లీ : పరిశోధనాత్మక వార్తలకు పేరొందిన తెహల్కా పత్రిక మూసి వేస్తున్నారన్న వూహాగానాలు రాజధాని నగరంలో షికారు చేస్తున్నాయి. అధికారికంగా తెహల్కా మూసివేతపై ఎలాంటి ప్రకటనా వెలువడకపోయినా, అందులో పని చేసే వారు కొందరు ఈ విషయం నిర్ధారించినట్లు సమాచారం. ఇప్పటికే 50 మంది ఉద్యోగులున్న పర్కులేషన్‌ విభాగాన్ని పత్రిక బూసివేసినట్లు తెలుస్తోంది. డిసెంబరు నెల జీతాలు మంగళవారం అందజేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినప్పటికీ, ఉద్యోగులు మాత్రం ఈ విషయంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న తెహల్కా చీఫ్‌ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ గోవా జైలులో ఉన్న విషయం తెలిసిందే.