ముఖ్యమంత్రి పదవి రేసులో లేను :చిరంజీవి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని ఈ విషయంలో మీడియా అనవసరంగా గందరగోళం సృష్టిస్తోందని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన శంషాబాద్‌ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవిపై అధిష్ఠానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని  ఒక వేళ ముఖ్యమంత్రి పదవి తనకిస్తుంటే ఆ విషయం మీడియాకే ముందు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి కొత్త పార్టీపై తానేమీ వ్యాఖ్యానించబోనని ప్రజా స్వామ్యంలో ఎంరైనా రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చన్నారు.