శంషాబాద్ విమానాశ్రమంలో భారీగా డ్రగ్స్ పట్టినేత
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రమంలో భారీ మొత్తంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న మహిళను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్‌ఆఫ్రికాకు చెందిన జోనాశ్యాముల్ అనే మహిల అబుదాబీ విమానంలో సుమారు 25 కిలోల ఎపిడ్రిన్ అనే మత్తు పదార్థాన్ని బ్యాగ్‌లో తీసుకేళ్లేందుకు ప్రయత్నించడంతో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్‌ను పశువులకు అనస్తీషియాలో వినియోగిస్తారు అని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అదే విధంగా పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.కోట్లలో ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని నిందితురాలిని విచారిస్తున్నారు. విచారణ అనంతరం నిందితురాలిని చెన్నై డీఆర్‌ఐకు అప్పగించనున్నట్లు అధికారులు సమాచారం ఇచ్చారు.