ఓట్ల కోసమే కేసీఆర్ అభివృద్థి వాదం: పొన్నాల లక్ష్మయ్య
ఓట్ల కోసమే కేసీఆర్ అభివృద్థి వాదం: పొన్నాల లక్ష్మయ్య
హైదరాబాద్: ఏనాడూ అభివృద్ధిపై మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు ఆకాశాన్ని కిందికి తెస్తానంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య విమర్శించారు. మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల అభివృద్ధికి కేసీఆర్ ఏ ప్రతిపాదనలు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసమే కేసీఆర్ అభివృద్ధి వాదాన్ని ఎత్తుకున్నారని పొన్నాల విమర్శించారు.