శంషాబాద్‌లో మళ్లీ బంగారం పట్టివేత

హైదరాబాద్‌,ఏప్రిల్‌5:  శంషాబాద్‌ విమానాశ్రయంలో మరోమారు బంగారం పట్టుబడింది. ఇద్దరు మహిళ ప్రయాణికుల నుంచి కస్టమ్స్‌ అధికారులు శనివారం కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తున్న క్రమంలో…  ఇద్దరు మహిళల లగేజీలో బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు కనుగొన్నారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని కస్టమ్స్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇక్కడికి వస్తున్న ప్రచయాణికుల నుంచి కిలోల కొద్దీ బంగారం పట్టుబుతోంది.