ఎవరూ పార్టీవిడిన పర్వాలేదు కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం:రఘువీరా
హైదరాబాద్: సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఫర్వాలేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలోని యువరక్తంతో బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ, వైఎస్సార్సీపీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయని విమర్శించారు. రాష్ట్రం నుంచి అవకాశవాద పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.