కూతుళ్లకు ఉరివేసి ఆతర్వాత తల్లితండ్రుల ఆత్మహత్య!

హైదరాబాద్: ఇద్దరు కూతుళ్లను చంపి ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించడమే కాకుండా ఆప్రాంత ప్రజల్ని విషాదానికి గురి చేసింది. లాలాపేట్ ప్రాంతంలోని శాంతినగర్ లో నివాసముంటున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి ప్రవీణ్ కుమార్, తన భార్యతో కలిసి ఐదేళ్ల, మూడేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు కూతుళ్లకు ముందు ఉరి వేసి ఆతర్వాత వాళ్లు కూడా సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ప్రాణాలు విడిచారు.
ఈ దుర్ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. నలుగురు మరణించి ఉండటాన్ని ఇరుగుపొరుగువారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరణానికి సంబంధించిన సూసైడ్ నోట్ వారి వద్ద లభించలేదు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు దారి తీసిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.