సీమాంధ్రలో సోనియా,రాహుల్ పర్యటన..
(జనంసాక్షి): త్వరలో సీమాంధ్రలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, యువనేత రాహుల్ గాంధీ పర్యటిస్తారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి పేర్కొన్నారు. సీమాంధ్రలో కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు సోనియా, రాహుల్ పర్యటించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు విశాఖ, గుంటూరు, అనంతపురంలో సభల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే తేదీలను ఖరారు చేయనున్నట్లు రఘువీరా పేర్కొన్నారు.మరోవైపు తెలంగాణ ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ పార్టీలో స్పష్టత లేదు. సోనియా సభ మినహా దేనిపైనా స్పష్టత కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రచారంలో ఎలా ముందుకు వెళ్లాలా అన్న అంశంపై నేతలు తర్జనభర్జన పడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించడంలో వెనకబడిందనే చెప్పవచ్చు. ఇంతవరకు ప్రణాళిక ఖరారు కాలేదు. ఈ నెల 16న సోనియా గాంధి సభ జరగబోతోంది. ఇక రాహుల్ గాంధి సభలు ఉంటాయా? ఎన్ని ఉంటాయి? ఎక్కడ నిర్వహిస్తారన్న దానిపై ఇంతవరకు స్పష్టత లేదు.