ఉత్తమ్ కారు దగ్ధం

నల్గొండ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెందిన ఇన్నోవా కారు సూర్యాపేట వద్ద దగ్ధమైంది. ఈ కారులో నోట్ల కట్టలు దగ్ధమయ్యాయి. కారు తగులబడుతుండగానే అక్కడి వారు అందులో నుండి నోట్ల కట్టలు తీసుకున్నారు. కారు ఇంజన్ లో ఈ నగదు దాచి పెట్టినట్లు సమాచారం. ఇందులో సుమారు రూ.50 లక్షల నగదు ఉంటుందని అనుమానిస్తున్నారు. కారు ప్రమాదానికి గురి కాగానే డ్రైవర్ పరారయ్యాడు. ఈ కారుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో స్టిక్కర్ అతికించి ఉంది. మరోవైపు దిండి మండలం బొల్లన్నపల్లి గ్రామంలో తెలుగుదేశం – కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.