మోడీలా పిరికివాడిని కాదు: దిగ్విజయ్

న్యూఢిల్లీ: బీజేపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీలా తాను పిరికివాడిని కాదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. టివి యాంకర్‌ అమృతారాయ్‌తో సంబంధంపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ… ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషమని పేర్కొన్నారు. మోడి 30 ఏళ్లు తన పెళ్లి విషయం దాచిపెట్టారు, కానీ తాను అలా కాదని, అమృతారాయ్‌తో ఉన్న సంబందాన్ని బహిరంగపర్చానని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఆమెకు విడాకులు వచ్చిన తరువాత పెళ్లి చేసుకుంటామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి విమర్శలనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నేత జవాబిచ్చారు.