వారణాసిలో మోడీ మీటింగ్ కి నో పర్మిషన్

వారణాసి (జ‌నంసాక్షి ) :వారణాసి నుంచి లోకసభ పోటీ చేస్తున్న బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. వారణాసిలో ర్యాలీలు, రోడ్ షోకు అనుమతిని నిరాకరించింది.
మోడీ గురువారం నాడు వారణాసిలో రెండు ర్యాలీలు, ఒక రోడ్ షో నిర్వహించవలసి ఉంది. అయితే ఈ అనుమతి నిరాకరణతో ఆయన రాక పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నరేంద్ర మోడీ వడోదర, వారణాసిలనుంచి పోటీ చేస్తున్నారు. వడోదర పోలింగ్ పూర్తయింది. వారణాసి లో మే 12 న పోలింగ్ జరగాల్సి ఉంది. అదే ఆఖరి విడత పోలింగ్ కావడం విశేషం.