‘బీజేపీకి ఓటు వేయండి దేశ భవిష్యత్తు మార్చండి’
ఉత్తరప్రదేశ్: దేశ ప్రజలు బీజేపీ పార్టీని గెలిపించి దేశ భవిష్యత్తును మార్చాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. అజంఘడ్ ఎన్నికల బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తూ యూపీని తండ్రికొడుకులు, దేశాన్ని తల్లీ కొడుకులు నాశనం చేశారని నిప్పులు చెరిగారు. మనకు మంచి రోజులు రాబోతున్నాయని మోడీ తెలిపారు. అవినీతి కాంగ్రెస్‌ను పంపించాలని దేశమంతా కోరుకుంటుందని అన్నారు. యూపీఏ పాలనలో సామాన్యుడికి ఎలాంటి ప్రయోజనం కలగలేదని.. పదేళ్లు పాలించిన అవినీతి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.