రక్షక భటులే కీచకులయ్యారు
యువతిపై పోలీసుల సామూహిక అత్యాచారం
ముజఫర్నగర్ : ఉత్తరప్రదేశ్ నేరాలకు రాజధాని అన్న విషయం మళ్లీ రుజువైంది. ఇద్దరు పోలీసులు సహా నలుగురు వ్యక్తులు కలిసి 15 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ సంఘటన సహారన్పూర్ జిల్లా కొత్వాలి ప్రాంతంలో జరిగింది. ఆ నలుగురు ఆ యుతిని గంగో ప్రాంతం నుంచి ఎత్తుకెళ్లి, సమీపంలోని ఓ అడవిలోకి తీసుకెళ్లి అక్కడ ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారు. సుభాష్్, వివేక్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు జిషాన్ అనే మరో నిందితుడిని కూడా అరెస్టు చేశామని, నదీమ్ అనే నాలుగో నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడని సహారన్పూర్ రేంజి డీఐజీ రఘువీర్ లాల్ తెలిపారు. నిందితులైన ఇద్దరు పోలీసులను డిస్మిస్ చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు.