-->

‘సీమాంధ్రలో కాంగ్రెస్కు ఒక్క లోక్సభ సీటు రాదు’

న్యూఢిల్లీ : ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో ఓ విధమైన కోపం ఏర్పడిందని తెలిపారు. ఈ ఎన్నికలలో ఓటమి తప్పదని భావించిన యూపీఏ భాగస్వామ్య పక్షాల్లోని పార్టీలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయన్నారు. గురువారం న్యూఢిల్లీలో వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క లోక్సభ సీటు కూడా రాదని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్దంగా ఉన్నారని వెంకయ్య గుర్తు చేశారు. స్నూప్గేట్ కాంగ్రెస్ కు వీప్గేట్ అయిందంటూ ఆయన చమత్కరించారు.  దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లిన నరేంద్ర మోడీ ఈజ్ ద బెస్ట్ అని ప్రజలు వెల్లడిస్తున్నారని వెంకయ్యనాయుడు వెల్లడించారు.