కేసీఆర్ అధ్వర్యంలో రేపు టీఆర్ఎస్ కీలక భేటి

 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పొలిట్‌ బ్యూరో సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తున్నట్టు ఆపార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెజార్టీ సీట్లు లభించవచ్చని టీఆర్ఎస్ అంచనా వేస్తున్న నేపథ్యంలో పోలిట్ బ్యూరో సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.భవిష్యత్ లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణ,  కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి మద్దతుతోపాటు, రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీ దృష్టి సారించాల్సిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల్లో, నేతల్లో నెలకొన్న పలు సందేహాలపై  కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశానికి పార్టీ నేతలు, అభ్యర్థులు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.