నితీశ్ నైతిక బాధ్యత
బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
పాట్నా, మే 17 (జనంసాక్షి) :
బీహార్ పార్టీ ఓటమికి జేడీయూ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నైతిక బా ధ్యత వహించారు. ముఖ్యమంత్రి పదవికి రా జీనామా చేయడంతో పాటు శాసనసభ రదు ్దకు సిఫార్సు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట మికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసినట్లు నితీశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌ను కలసి రాజీనా మా పత్రం సమర్పించారు. ప్రజాతీర్పును తాను గౌరవిస్తున్నానన్నారు. సార్వత్రిక ఎన్ని కల్లో పార్టీ పరాజయానికి నైతికి బాధ్యతగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం పాట్నాలో
ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యర్థులు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేసిన జేడీయూ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. భాజపా కూటమి 31 స్థానాల్లో (భాజపా 22, ఎల్జేపీ 6, ఆర్‌ఎల్‌ఎస్పీ 3)గెలవగా.. కాంగ్రెస్ 2, ఆర్జేడీ 4 స్థానాలు దక్కించుకున్నాయి. మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎన్డీయే కూటమిలోంచి వైదొలగిన జేడీయూ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగింది. 2009లో భాజపాతో పొత్తు పెట్టుకుని 20 స్థానాల్లో గెలుపొందిన జేడీయూ ప్రస్తుత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ హవాతో బీహార్‌లో దారుణ పరాభవం ఎదుర్కొంది. 40 స్థానాల్లో పోటీచేసి జేడీయూ కేవలం రెండు స్థానాతోనే సరిపెట్టుకుంది. గతంలో మోడీని ప్రధానిగా ప్రకటించగానే జేడీయూ ఎన్డీఏ నుంచి వైదొలగింది. బీజేపీ సభ్యులను మంత్రివర్గం నుంచి తొలగించారు. తాము బీజేపీతో ఉండలేమన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నితీష్‌కుమార్ వ్యవహారశైలిపై పార్టీ నేతల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. బీహార్‌లో భాజపాతో పొత్తు పెట్టుకొని ఉంటే ఎక్కువ స్థానాల్లో పార్టీ గెలిచేదని అలాకాకుండా ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడంతో పార్టీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ వైదొలగడానికి నితీష్ తొందరపాటే కారణమని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఇక్కడ అధికారం దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. చాలామంది నేతలు ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. మోడీ హవాలో బీహార్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.