హామీలు నెరవేర్చేవరకు పోరాటం చేస్తాం:రఘువీరా
హైదరాబాద్:ఇటీవల ఎన్నికల్లో గెలిచిన పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు పోరాడతామని కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతు రుణాలను వెంటనే మాఫీ చేయాలని విజ్ఙప్తి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పార్టీలు ఓటమి పాలైనపుడు రాజీనామా చేయడం సరికాదన్నారు. పూర్తి బాధ్యత తీసుకొని పార్టీని మెరుగు పర్చే వారే నాయకులని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు కాపలా కుక్కల్లా పనిచేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.