విజయవాడ, అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక రైలు

నాగపూర్ : వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ, అహ్మదాబాద్ ఈ నెల 30 నుంచి సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైలును నడుపుతారు. ఆ రైలు బలార్షా గుండా ప్రయాణిస్తుంది. తదనుగుణంగా నెంబర్ 02714 రైలు మే 30వ తేదీ(శుక్రవారం) రాత్రి ఏడు గంటలకు విజయవాడ నుంచి బయలుదేరుతుంది. మే 31వ తేదీ (శనివారం) సాయంత్రం 05.45 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. అది మే 31న మధ్యాహ్నం 12.25 గంటలకు బలార్షా మీదుగా వెళుతుంది.అలాగే నెంబర్ 02713 రైలు మే 31వ తేదీ(శనివారం) రాత్రి 07.30 గంటలకు అహ్మదాబాద్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు అనగా జూన్ ఒకటో తేదీ(ఆదివారం) సాయంత్రం 06.55 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. జూన్ ఒకటో తేదీ మధ్యాహ్నం 12.55 గంటలకు బలార్షా మీదుగా వెళుతుంది. రైలు అహ్మదాబాద్ చేరుకోడానికి ముందు ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, రామగుండం, బలార్షా, బడ్నేరా, భుసవల్, నందుర్బర్, సూరత్, వడోదరా స్టేషన్లలో ఆగుతుంది. 17 బోగీలతో కూడిన ఆ రైలుకు ఒక సెకండ్ ఎసి, రెండు థర్డ్ ఏసీ, 10 స్లీపర్ బోగీలు ఉంటాయని సెంట్రల్ రైల్వే నాగపూర్ డివిజన్ ఒక ప్రకటనలో తెలిపింది.