‘ఒకటో తేదీకల్లా ఇద్దరు సిఎస్‌ల నియామకం’

హైదరాబాద్ : వచ్చేనెల ఒకటో తేదీ నాటికి తెలంగాణ, విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా కొత్త రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నియామకానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి కె మహంతిని ఆదేశించారు. ఈ విషయమై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా నియమితులు కానున్న కెసిఆర్, చంద్రబాబులతో చర్చించాలని కూడా గవర్నర్ నరసింహన్, మహంతిని ఆదేశించారు.ఈనెల ఒకటో తేదీ నుంచి వచ్చేనెల ఒకటో తేదీ మధ్య కాలంలో జరిగే లావాదేవీల వల్ల వచ్చే పన్నుల రాబడిని విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేయాలని జిఓ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి 41.68 శాతం పన్ను రాబడి కేటాయించాలని నిర్ణయించారు. మరోవైపు అఖిల భారత సర్వీసుల అధికారులను రెండు రాష్ట్రాలకు కేటాయించే విషయమై ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ ఈనెల 28వ తేదీన ఢిల్లీలో సమావేశం కానున్నది.