వంద కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రూ.100 కోట్లు విలువచేసే 21 కిలోల హెరాయిన్‌ను పోలీసులు సోమవారం పట్టుకున్నారు. దీనిని అక్రమంగా తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు ముంబైకి చెందిన షాజహాన్ మొహద్ యాసిన్, మహ్మద్ సాజిద్, అబ్దుల్ సత్తార్, అబ్దుల్ రహిమాన్‌లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.