వాజ్‌పేయిని కలిసి ఆశీస్సులు తీసుకున్న మోదీ
న్యూఢిల్లీ, మే 26 : భారత దేశ 15వ ప్రధాన మంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ, బీజేపీ మాజీ ప్రధాని వాజ్‌పేయిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. దేశంలోనే ఉన్నతమైన భాధ్యతను చేపట్టబోతున్న మోదీ భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా తగిన సూచనలు, సలహాలను వాజ్‌పేయి దగ్గర తీసుకున్నారు.
అనంతరం వెంకయ్యనాయుడు, మేనకా గాంధీ, ఉమా భారతి, రవిశంకర్‌ప్రసాద్, నిర్మలా సీతారామన్‌లు మోదీని కలిశారు. బీజేపీ నాయకులు గుజరాత్ భవన్‌కు క్యూకట్టారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, రాం విలాస్ పాశ్వాన్, జనరల్ వీకే సింగ్‌లు మోదీతో సమావేశం కానున్నారు.