ఎంపిలతో చంద్రబాబు
హైదరాబాద్ : కేంద్రం నుంచి ఉదారంగా రాష్ట్రానికి భారీ నిధులు సంపాదించుకోవాలంటే పార్లమెంట్ సభ్యులు అధిక సమయం ఢిల్లీలోనే గడపాలని చంద్రబాబు ఉద్బోధ చేశారు. నియోజకవర్గాల్లో అత్యవసరమైన పని ఉంటే తప్ప ఢిల్లీలోనే బస చేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని వారికి చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది.అదే విధంగా యుపిఎ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రకు ఇచ్చిన హామీలు రాబట్టుకునేందుకు చంద్రబాబు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.తిరుపతిలో ఐఐటి, విశాఖపట్నంలో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన వాగ్ధానాల అమలుకు ప్రస్తుత విశ్వవిద్యాలయాలను అప్‌గ్రేడ్ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన ప్రత్యేక ఆర్థిక రాష్ట్ర హోదాతో ఇంకా ఐఐఎం, ఎన్ఐటి తదితర జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత యోచిస్తున్నారు. ప్రతి ఎంపి ఒక్కో ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చంద్రబాబు ఆదేశించారు.