రోడ్డు ప్రమాదంలో గవర్నర్ జాయింట్ సెక్రటరీకి గాయాలు
నల్గొండ, జూన్ 4 : జిల్లాలోని నార్కట్‌పల్లి దగ్గర బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గవర్నర్ జాయింట్ సెక్రటరీ బసంత్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని బసంత్‌కుమార్‌ను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.