ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం
గుంటూరు, జూన్ 8 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదివారం సాయంత్రం 7:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణం స్వీకారం చేయించారు. జిల్లాలోని ఆచార్యా నాగార్జున యూనివర్సిటీ వద్ద జరిగిన ప్రమాణస్వీకారమహోత్సవానికి అతిరథ మహారథులు తరలివచ్చారు. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 20 మంది కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు వేదిక వద్ద ఆశీనులయ్యారు. భారీగా సంఖ్యలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ప్రమాణ స్వీకారానికి తరలివచ్చారు.