చంద్రబాబుకు శుభాకాంక్షలు : వివేక్ ఒబెరాయ్

ముంబై, జూన్ 8 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారోత్సవానికి చంద్రబాబు తనను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు ఆయన అన్నారు. చంద్ర బాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆశిస్తున్నాని వివేక్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీతకు వివేక్ శుభాకాంక్షలు తెలియజేశారు.