కరాచీ విమానాశ్రయంపై మళ్లీ దాడి

vimanam
పాకిస్థాన్‌ భద్రతా డొల్లతనం బయటపడింది
కరాచీ, జూన్‌ 10 (జనంసాక్షి) :
పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంపై ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబ డ్డారు. రెండ్రోజుల క్రితమే దాడికి పాల్ప డిన దుండగులు ఈసారి వైమానిక రక్షణ దళ వసతి గృహం లక్ష్యంగా దాడు లకు పాల్పడ్డారు. ఉగ్రవాదులకు, భద్ర తా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రదాడి నేపథ్యంలో కరాచీ విమానాశ్రయం నుంచి అన్ని రాకపోకలను నిలిపివేశారు. సోమవారం విమానాశ్రయంపై
జరిగిన దాడిలో పది మంది ఉగ్రవాదులతో పాటు 30 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుంచి కోలుకొనక ముందే ఉగ్రవాదులు మరోమారు దాడులకు తెగబడ్డారు. వారి దాడులను ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఫోర్స్‌, భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. నలుగురు, ఐదుగురు ఉగ్రవాదులు పెహల్వాన్‌ గోత్‌ పక్క నుంచి కాల్పులు ప్రారంభించారు. గ్రేనెడ్లతో దాడులు చేశారు. వారితో భద్రతా బలగాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో విమానాశ్రయానికి విమానాల రాకపోకలను నిలిపివేశారు. సవిూప ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. రెండ్రోజుల క్రితం దాడులకు తెగబడ్డ ఉగ్రవాద సంస్థ తెహ్రీక్‌ తాలీబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) తాజా ఘటనకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. తాజా దాడితో పాకిస్థాన్‌లో భద్రత డొల్లతనం తేటతెల్లమవుతోంది.