కలకలం రేపింన అర్థరాత్రి అపార్ట్‌మెంట్‌లో గొడవ

పిస్తోలుతో దాడి
హైదరాబాద్‌: విశాఖనగరంలో అర్థరాత్రి ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన గొడవ కలకలం రేపింది. సీతమ్మధారలోని శ్రీవర్షిణి అపార్ట్‌మెంట్‌లో కారు పార్కింగ్‌ విషయంలో ఫ్లాట్‌ ఓనర్లలో ఒకరైన బిల్డర్‌ వెంకటపతిరాజు, మరో ఫ్లాట్‌ ఓనర్‌ షేక్‌ భాషాకు మధ్య ఘర్షణ జరిగింది. వెంకటపతిరాజు పిస్తోలుతో తీవ్రంగా కొట్టారని షేక్‌ భాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘర్షణలో భాషా బావమరిది అబ్దుల్‌ సత్తార్‌కు తీవ్ర గాయాలవడంతో అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. భాషా కుటుంబ సభ్యులు తమపై దాడి చేశారని వెంకటపతిరాజు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.