కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుస సమావేశం

ఢిల్లీ: కేంద్రవిద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ’ాటీ అయ్యారు. సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లకోసం విద్యుత్‌ సంస్కరణలుప్రారంభించినట్లు చెప్పారు. విద్యుత్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరామన్నారు. పరిశ్రమలు, ఇళ్లు, వ్వయసాయానికి 24గంటల విద్యుత్‌ సరఫరాకు పథకాలు, ఎన్టీపీసీ, రైల్వేలైన్లకు బొగ్గు కేటాయించేందుకు విద్యుత్‌శాఖ మంత్రి అంగీకరించినట్లు తెలిపారు. రానున్న రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణకు కూడా సాయం అందించాలని విజ్ఞప్తి చేశామన్నారు. తమ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు చంద్రబాబు తెలిపారు. విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సహకరించనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌లోగా ఏపీలో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి సహకరిస్తామని చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామని స్పష్టం చేశారు. ఈ బ’ాటీలో రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ళ్ణడు, నారాయణ, సుజనాాదరి, కంభంపాటి రామ్మోహన్‌రావు ఎంపీలు సుజనాాదరి, సీఎం రమేష్‌, గల్లా జయదేవ్‌ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్‌శాఖ మంత్రితో బ’ాటీ అనంతరం చంద్రబాబు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజుతో బ’ాటీ అయ్యారు.