‘పోలవరంపై పునరాలోచించుకోవాలని కోరాం’
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్స్‌పై పునరాలోచించుకోవాలని ప్రధానిని కోరామని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్ గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మంచిదికాదని తెలిపామని పాల్వాయ్ పేర్కొన్నారు. మాకు అన్యాయం చేసి ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలనుకోవడం సరికాదు అని వివరించామని తెలిపారు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో సభ్యులను కలిసి పోలవరం, పార్టి పరిస్థితిపై చర్చిస్తామని తెలిపారు.