ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మార్గదర్శకాలు సిద్ధం?
హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రా విద్యార్థుల విషయంలో…. 1956 కు ముందు హైదరాబాద్‌లో స్థిరపడ్డ వారి పిల్లలకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఫీజు రియింబర్స్‌మెంట్‌కు సంబంధించిన మార్గదర్శకాలపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే.