ఎనిమిదేళ్ల బాలిక గొంతుకోసిన ఉన్మాది
ఖమ్మం: జిల్లాలోని ఇల్లందు ఎల్‌బీఎస్ నగర్‌లో ఓ ఉన్మాది ఎనిమిది ఏళ్ల బాలిక గొంతు కోసి వాగులో పడేశాడు. స్థానికులు బాలికను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.