పాము కరిచిందనే అనుమానంతో మంత్రిని ఆస్పత్రికి తరలింపు!
భోఫాల్: పాము కాటుకు గురైనారనే అనుమానంతో మంత్రిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లో పౌర సరఫరాల శాఖాను నిర్వహిస్తున్న విజయ్ షా పాముకాటుకు గురయ్యారు. పాము కాటుకు గురైన మంత్రిని ప్రభుత్వ జేపీ ఆస్పత్రికి తరలించారు.
పాముకాటుకు గురయ్యారా లేక విష కీటకం కుట్టిందా అనే విషయంపై ఇంకా నిర్ధారణకు రాలేదని జేపీ ఆస్పత్రి ముఖ్య వైద్యాదికారి పంకజ్ శుక్లా తెలిపారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున 3.30 నిమిషాలకు జరిగిందన్నారు. మంత్రి షాను ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.