హైదరాబాద్ నుంచి రేణిగుంట బయలుదేరిన గవర్నర్, చంద్రబాబు
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు రేణిగుంట బయలుదేరారు. రేణిగుంట మీదుగా శ్రీహరికోట వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం 6గంటలకు శ్రీహరికోట రానున్న ప్రధాని మోడీకి గవర్నర్, చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. అనంతరం ప్రధానితో చంద్రబాబు విడిగా సమావేశమై రాష్గానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్ర రెవెన్యూ లోటును పూడ్చడంతో పాటు విభజన బిల్లులో పెట్టిన విద్యాసంస్థల ఏర్పాటు, ఏపీకీ 15ఏళ్ల ప్రత్యేక ¬దా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇచ్చే అంశాలను మోడీకి పవర్‌పాయింట్ ప్రదర్శన ద్వారా వివరించనున్నారు. రాత్రికి ఇరువురు నేతలు శ్రీహరికోటలోనే బస చేయనున్నారు.