పోలవరంబిల్లుకు అనుమతివ్వొద్దని రాష్ట్రపతినికోరుతాం
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు విషయంలో గిరిజనులను నిరాశ్రయులను చేయ్యొద్దని కోరుతూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశామని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ఇంకా ఈ విషయమై తాము రాష్ట్రపతిని కలిసి పోలవరం బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేందుకు అనుమతివ్వొద్దని కోరుతామని వెల్లడించారు. గవర్నర్ అధికారాల విషయంలో కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆఫీసు మెమోను కూడా తాము రాజ్‌నాథ్‌సింగ్‌కు చూపించామని తెలిపారు. ఈ మెమోను చూసి ఆయన కూడా దానిని చదివి ఆశ్చర్యపోయారని వివరించారు. ఈ విషయంలో కేంద్రం తప్పకుండా వెనుకడుగు వేస్తుందని భావిస్తున్నానన్నారు.