హైదరాబాద్‌లో భారీ వర్షం

yhy52jx1
హైదరాబాద్: నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, శంషాబాద్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో భారీగా వాన పడింది. ఈ వాన కారణంగా రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల వర్షం కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.