నకిలీ మద్యం కేసు ఏపీ సీఐడీకి అప్పగింత
హైదరాబాద్, జులై 10 : నకిలి మద్యం కేసు దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఎన్నికల సమయంలో నకిలి మద్యం పెద్ద ఎత్తున పంపిణి చేసిన విషయం తెలిసిందే. నకిలి మద్యం తాగి కొంతమంది చనిపోయారు. నకిలి మద్యం పంపిణి వెనుక కొంత మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఈ కేసు దర్యాప్తును సిఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నెల్లూరు జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లో పంపిణి చేసిన నకిలి మద్యనికి సంబంధించిన కేసులన్నీ ఒకటే కేసు కింద నమోదు చేస్తూ.. ఈ కేసును సీఐడీకి ఏపీ ప్రభుత్వం అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నకిలి మద్యం వెనుక ఎవరు ఉన్నారో అన్నదానిపై సీఐడీ అధికారులు దర్యాప్తు ప్రారంబించనున్నారు.