నిజామాబాద్ కలెక్టరేట్ ముట్టడికి ఏబీవీపీ యత్నం
హైదరాబాద్: నిజామాబాద్ కలెక్టరేట్ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. ఉపకారవేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు పలువుర్ని అరెస్టు చేశారు. దీంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.