రేపు తెలంగాణ బంద్‌ కోదండరాం

హైదరాబాద్‌: లోక్‌సభలో పోలవరం బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ బంద్‌ పాటించాలని రాజకీయ ఐకాస ా’య్రర్మన్‌ ఆచార్య కోదండరాం పిలుపునిచ్చారు. రాష్ట్ర బంద్‌కు అందరూ మద్దతివ్వాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం వైఖరి ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. గిరిజనులకు కూడా ప్రత్యేక హక్కులు ఉన్నాయని అన్నారు. పోలవరం బిల్లు ఆమోదంపై వామపక్షాలు కూడా నిరసన వ్యక్తం చేశాయి. శనివారం తెలంగాణలో బంద్‌ పాటించాలని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌)లు కూడా పిలుపునిచ్చాయి.