8, 9 తేదీలలో భారత్‌-శ్రీలంక సంబంధాలపై సదస్సు

8, 9 తేదీలలో భారత్‌-శ్రీలంక సంబంధాలపై సదస్సు

హైదరాబాద్‌ : భారత్‌-శ్రీలంక సంబంధాలపై అంతర్జాతీయ సదస్సు ఈ నెల 8,9 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎస్‌.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఓయూ సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌ స్టడీస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌-శ్రీలంక దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత పటిష్టపరచేందుకు ఇలాంటి అంతర్జాతీయ సదస్సులు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. భారత్‌-శ్రీలంక దేశాల మధ్య ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సంబంధాలు పటిష్టపరచేందుకు ఉపయోగపడతాయన్నారు. ఓషియన్‌ స్టడీస్‌ అంతర్జాతీయ స్థాయి సదస్సును నిర్వహించేందుకు ముందుకు రావడం హర్షనీయమన్నారు. అంతకుముందు వీసీ ఓషియన్‌ సెంటర్‌లో ప్రొఫెసర్‌ ఆర్‌.సిద్ధాగౌడ్‌ మాట్లాడుతూ మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు ఎనిమిది దేశాలకు చెందిన సుమారు 60 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.