జమ్మూ-కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో కాల్పులు

జమ్మూ-కశ్మీర్‌, జులై 20 : గాజాపై ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేరకంగా జమ్మూ-కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిపిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు, సీఆర్పీఎఫ్‌ బలగాలమధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక యువకుడు మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సవిూప ఆస్పత్రికి తరలించారు. భారీగా పోలీసులు మోహరించారు.