అల్జీరియా లో విమానం అదృశ్యం…
విమానాల అదృశ్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా అల్జీరియాకు చెందిన ఓ విమానం అదృశ్యమైంది. బుర్కినాఫాసో విమానాశ్రయం నుంచి అల్జీరియాకు వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన 50 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. అల్జీరియా సరిహద్దుకు సమీపంలో ఉండగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానం దారి మళ్లించుకోవాలని ఏటీసీ సిబ్బంది సూచించినట్టు తెలుస్తోంది. అయితే ఇది జరిగిన కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఏహెచ్ 5017 నెంబర్ గల ఈ విమానంలో మొత్తం 110 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు.