9 మంది మావోయిస్టుల మృతి

ఖమ్మం, జనంసాక్షి: ఆంద్రా-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో పోలీసుకు మావోల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో 9 మంది మావోలు మృతిచెందినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు 15 కిలో మీటర్లు దూరంలో ఉన్న కిష్టారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుమ్మరితోపు అటవీప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి భారీగా అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కూంబింగ్‌లో ఆంధ్రా గ్రేహౌడ్స్‌, ఛత్తీస్‌ గడ్‌ ప్రత్యేక దళాలు పాల్గొన్నాయి.