9 నుంచి తెలంగాణ జనవిజ్ఞాన వేదిక మహాసభలు
హైదరాబాద్: వచ్చే నెల 9 నుంచి మూడు రోజులపాటు తెలంగాణ జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహించనున్నారు. ఈమేరకు వేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రమేష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జనవిజ్ఞాన వేదిక కొత్తగా ఏర్పడిందని, రాష్ట్రంలో ప్రజలను చైతన్య పరిచేందుకు ఈ వేదిక పనిచేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి, నాణ్యమైన విద్యతోపాటు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశాల్లో చర్చించనున్నట్టు రమేష్ వివరించారు.