ఆత్మీయంగా ఎరాజ్ పల్లి 7వ తరగతి విద్యార్థుల సమ్మేళనం

బోధన్, (జనంసాక్షి) : బోధన్ మండలం ఎరాజ్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో 1992-93 సంవత్సరంలో 7వ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థులు సోమవారం వారి క్లాస్ మెంట్ చంద్రకాంత్ రెడ్డి నివాస గృహంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మరిచిపోలేని సన్నివేశాలను నెమరు వేసుకున్నారు. ఉద్యోగరీత్యా,వివాహాలు చేసుకుని దూర ప్రాంతాలలో సైతం స్థిరపడినప్పటికీ తన చిన్ననాటి తరగతిలో చదువును అభ్యసించిన సన్నివేశాలు, చిలిపి చేష్టలు చేసుకున్న సందర్భాలను తెలియపరచుకొని సంతోషకరమైన వాతావరణాన్ని నెలకొల్పారు. 33 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత విద్యార్థిని విద్యార్థులు ఒక దగ్గరికి చేరుకొని ఆత్మీయతను పంచుకున్నారు. సహపంక్తి భోజనాలు చేశారు. కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎవరు ఏ స్థాయిలో స్థిరపడినప్పటికీ ఒకరికి ఒకరం సోదరా భావంతో ఉంటూ సహాయ సహకారాలు చేసుకుంటూ తోడునీడగా ఉందామన్న సంకల్పం వారి ఆత్మీయతలో కళ్ళకు కట్టింది. వారి చిన్ననాటి జ్ఞాపకాలు అందరినీ మైమరిపించాయి. ఈ కార్యక్రమంలో ఎరాజ్ పల్లి ఏడవ తరగతి విద్యార్థినీ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

తాజావార్తలు