మహిళపై దుండగులు సామూహిక అత్యాచారం

 

హైదరాబాద్ (జనం సాక్షి)బీ పనులు ముగించుకొని మహిళ ఒంటిగా ఇంటికి వస్తుండగా మధురానగర్ లో ముగ్గురు యువకులు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు. నిందితులు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ చెందిన వారిగా పోలీసులు గుర్తించారు, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.