ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకే టికెట్ కేటాయించాలి: ఆర్ కృష్ణయ్య

 

 హైదరాబాద్ (జనం సాక్షి)బీ రాష్ట్రంలో జరగనున్న రెండు పట్టభద్రులు ,ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకే అన్ని పార్టీలు టికెట్లు కేటాయించాలని మాజీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఏ పార్టీ అయితే బీసీలకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా విస్మరిస్తుందో ఆ పార్టీని ఎన్నికల్లో కచ్చితంగా ఓడిస్తామని అన్నారు.