నవంబర్‌ 6నుంచి కుల గణన ప్రక్రియ

హైదరాబాద్‌ : కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో భాగంగా రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు.. దేశంలో మొదటిసారి సమగ్ర కుల గణన ప్రక్రియ నవంబర్‌ 6న ప్రారంభమవుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సమగ్ర సర్వే సక్రమంగా జరిగి భవిష్యత్‌లో అందరికి సమ న్యాయం జరిగేలా అందరు సహకరించాలన్నారు.దీనికి సంబంధించి త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు కూడా గ్రామీణ ప్రాంతాలలో అధికారులకు సహకరించాలని సూచించారు.
150 ఇళ్లకు అధికారుల బృందం సమగ్ర సమాచార సేకరణ చేపడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలన్నారు.