సాహిత్యం

సమ్మె సెగ రాజుకుంది ..?!

నీ రాజ సింహాసనం ఆశించలేదు మణులు,మాణిక్యాలేవి అడగలేదు పంట గిట్టుబాటు “ధర”  ఆర్తించారు సేద్యానికి “భద్రత ” కావాలన్నారు అంత మాత్రానికే …. నలుపు చట్టాలు ఎక్కుపెట్టి హక్కుల కుత్తుక తెగ్గోస్తానంటే .. బతుకుల సమాధి చేస్తానంటే … తలాడించే వెంగలప్పలు కారు ఉప్పు,కారం ఒంట బట్టించినోళ్లు తెగువతనం మెదట్ల దట్టించినోళ్లు త్యాగాలను తనువులకు అద్దినోళ్లు … వివరాలు

అన్నా అన్నా ! ఓ రైతన్నా !!

అన్నా ఓ రైతన్నా! అలా నింగిలోకి తొంగితొంగి చూడకు! ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశతో ఎదురు చూడకు! అన్నా ! ఓ రైతన్నా ! కార్చడానికి కళ్ళలో కన్నీరేలేదని నిప్పులై దహించే బ్యాంకుల అప్పుల్ని ఆర్పే దారేలేదని నోటికాడిముద్దలా చేతికందిన పంట దక్కేమార్గమేలేదని తాకట్టుపెట్టిన ఆలితాలిబొట్టు విడిపించుకొనే ఆశేలేదని ఇక ఆత్మహత్యే శరణ్యమని ఆవేశపడకురా … వివరాలు

ప్రజావ్యతిరేకతను చాటిచెప్పిన జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు !

     మద్యం ఏరులైపారిన,సంచులకొలది డబ్బులు పంచిన,ఓటర్లను ఆకర్షించడానికి మేనిఫెస్టో ద్వారా ఎన్నిరకాల హామీలు ఇచ్చిన,ఎన్నికల సమయంలో వేయాల్సిన ఎత్తుగడలు ఎన్నివేసిన,ప్రజలను కొంత భయాందోళనలకు గురిచేసి ఓటింగ్ శాతాన్ని తగ్గించడంలో కొంతవిజయం సాధించిన, ఎలాగైనా ఓటర్లను తమ జిమ్మిక్కులతో మసిపూసి మారేడుకాయ చెయ్యొచ్చులే అనుకున్నా,ప్రజాతీర్పు ఎలా ఉంటుందో మరొకసారి ఓటరు మహాశయులు ఈఎన్నికలలో చాటిచెప్పారనడంలో ఎలాంటి … వివరాలు

నగరం మూగబోయింది…!

ఈ నగరానికి ఏమైందో…? ఏ జఢత్వ నీడ కమ్మిందో ఏ అలసత్వ చీడ పట్టిందో అందుకే పెను నిద్రలో మునిగింది ఈ పట్టణ ప్రజానీకానికి …. ఏ నైరాశ్యం ఒంటబట్టిందో ఏ భయం చుట్టుముట్టిందో అందుకే…! గ్రేటర్ ఎన్నికల రణ క్షేత్రంలో అచేతనా పాత్ర పోషించింది మందకోడితనం నెత్తికెత్తుకు ఓటుకు “ఓటమి” కట్టబెట్టింది ప్రజాస్వామ్యాన్ని పరిహసించింది … వివరాలు

జరా “భద్రమన్నా” ఓటరన్నా….

నేడు నేతలు వంగి వంగి దండాలు పెడుతుంటే “జరా భద్రమన్నా ఓటరన్నా” రేపువాళ్ళే గెలిస్తే పవరొస్తే పంగనామాలు పెడతారని “అర్థమన్నా ఓటరన్నా” నేడు అడుగడుగున నీకు గొడుగు పడుతుంటే “జరా భద్రమన్నా ఓటరన్నా” రేపు ఆ గొడుగు కర్రతోనే నీ వెనుక లోతుగగోతులు తీస్తారని “అర్థమన్నా ఓటరన్నా” నేడు నీవు కసురుకుంటున్నా విసురుకుంటున్నా నేతలు నిన్ను … వివరాలు

నిలువుదోపిడికి పాల్పడుతున్న కార్పోరేటు వైద్యం!

కాలక్రమేణా పరిణామక్రమంలో భాగంగా సమాజంలోని వింతపోకడలను పరిశీలిస్తే.. ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తూ,ఆందోళనబాట పట్టిస్తుందినడంలో నిజంలేకపోలేదు. వాతావరణ కాలుష్యం, క్రిమి సంహారక రసాయనిక ఎరువులు, మందులు వాడుతూ పంటలు పండించడం, ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి కార్బైడ్ లాంటి పదార్థాలను ఉపయోగించి ఫలాలను తాజాగా కనిపించడం కోసం వాడటం, ప్రోటీన్స్, విటమిన్స్, కార్బో హైడ్రేట్స్ లేనటువంటి, పోషకాహారలేమి ఆహార పదార్థాలను … వివరాలు

శాపగ్రస్త జీవులు …

ఈ వ్యవస్థచే నిషేధానికి గురైనోళ్లు వివక్షతల దాస్తికంలో దగ్దమౌతునోళ్లు మనుషులుగా గుర్తింపు నోచుకోనోళ్లు చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నోళ్లు   దేశ పౌరులైనా … ఏ హక్కులు దక్కనోళ్లు ఏ ప్రగతి పలాలు చిక్కనోళ్లు   అయినవాళ్లకు … అనుబందాలకు దూరమై … ఒంటరి పయనం సాగిస్తున్నోళ్లు   అడుగడుగునా అవమానాలు దారి పొడవునా ఛీత్కారాలతో … వివరాలు

“కరోనా ప్యార్ కరోనా”

ప్యార్ కరోనా ముఝె ప్యార్ కరోనా నీ నిర్ణయమే చెలియా మేరా జీనా యా మర్నా నువ్వే నా లవ్వు దేవత నా గుండెలొ గుడి కడతా నువ్వే నా లైఫ్ నమ్మవే కాదంటే  నైఫ్ దింపవే ఎన్నిజన్మలైనా నిన్నే వైఫ్ గా చేసుకుంటా నీ  ఇంటి క్వారంటైన్ లో ఖైదీలా పడిఉంటా 1.నీ ఊసే … వివరాలు

పౌర సమాజమా మేలుకో!

నిశ్శబ్దంగా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి కడ చూపుకు నోచుకోక దేహాలు కాటిలో కాలుతున్నాయి ఆశ తెగిన వలస పక్షులు సొంత గూటికి నడక సాగిస్తున్నాయి లోకం తెలియని పసి ప్రాయాలు ప్రశ్నార్తకంగా మిగులుతున్నాయి ఇపుడు… ప్రపంచం చింతల శిభిరం బతుకు అంధకార బంధురం అంతటా…. చిక్కనౌతున్న కరోనా మేఘం మోగుతున్న మృత్యు నాదం అయినా.. ఎవరిలో … వివరాలు

పర్యావరణ దినోత్సవ సందర్భంగా

ప్రకృతి మొగ్గలు   తాను కరుణిస్తే పచ్చదనం తాను కళ్ళెర్ర జేస్తే ప్రళయం అదే కదా ప్రకృతి మహత్యం   మణి మాణిక్యాలకన్నా విలువైనవి మన మనుగడకు సహాయపడేవి వెలలేని ప్రకృతిలోని ఋతురాగాలు   పచ్చదనాన్ని పంచే వృక్షాలు ఆక్సిజన్ ను పెంచే మొక్కలు ఆరోగ్యాన్ని అందించే వనదేవతలు     పశువులు సైతం ప్రకృతికి … వివరాలు